: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయం: ఉత్తమ్ కుమార్ రెడ్డి


రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి  ప్రకటించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో పార్టీ అనుబంధ సంఘాల విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని, వాటిని నిరసిస్తూ పోరాటం చేయనున్నట్లు తెలిపారు.

ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం యువతను మోసం చేస్తోందని, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని, చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ నెల 22న కోదండరాం తలపెట్టిన ర్యాలీకి మద్దతు విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు.

  • Loading...

More Telugu News