: రాత్రికి రిసార్ట్స్ లోనే ఉంటానంటూ...మద్దతు ఎమ్మెల్యేలతో భేటీ అయిన శశికళ


తమిళనాడు రాజకీయాలు గోల్డ్ బే రిసార్ట్స్ కు తరలాయి. రేపు ఉదయం 10:30 నిమిషాలకు జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో అన్నాడీఎంకే తాత్కాలిక జనరల్ సెక్రటరీ శశికళా నటరాజన్ గోల్డ్ బే రిసార్ట్స్ కు వెళ్లారు. ఆమెకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలు గత కొన్ని రోజులుగా ఆ రిసార్ట్స్ లో ఉంటున్న సంగతి విదితమే. ఈ రాత్రంతా వారితోనే ఉంటానని ప్రకటించారు. ఈ సందర్భంగా వారితో భేటీ అయ్యారు. ఈ భేటీలో తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు చేపట్టాల్సిన చర్యలు, ఒకవేళ తాను జైలుకే వెళ్లాల్సి వస్తే తీసుకోవాల్సిన చర్యలపై ఆమె ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తమిళనాట అన్నాడీఎంకేకు రేపు అత్యంత కీలకమైన రోజుగా మారనుంది. రేపు కోర్టు ఆమెను దోషిగా నిర్ధారిస్తే ఆమె రాజకీయ జీవితం సమాధి అయినట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పార్టీ భవితవ్యం కూడా ప్రమాదంలో పడే అవకాశం వుందని వారు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పన్నీర్ సెల్వం ఎలాంటి అడుగులు వేస్తారోనని అంతా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News