: తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా సినీ నిర్మాత బండ్ల గణేష్


తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ ఎన్నికయ్యాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి నిర్వహించిన తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ (టీపీఎఫ్) అధ్యక్షుడిగా దిలీప్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ, టీపీఎఫ్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికవడం ఆనందంగా ఉందని అన్నాడు. తనకు ఈ బాధ్యతలు అందించిన ఎర్రబెల్లి ప్రదీప్ రావుకి ధన్యవాదాలు తెలిపారు. తన పదవికి, పౌల్ట్రీ రంగానికి వన్నెతెచ్చే విధంగా పని చేస్తానని బండ్ల గణేష్ తెలిపాడు. 

  • Loading...

More Telugu News