: వేదికపైనే అవార్డును రెండు ముక్కలు చేసి ప్రశంసలందుకున్న పాప్ సింగర్!


మ్యూజిక్ ఆస్కార్ గా అభివర్ణించే గ్రామీ అవార్డుల వేడుకలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ ఏడాది గ్రామీ అవార్డు ఉత్సవాల్లో బ్రిటిష్‌ సింగర్‌ అడెలె సత్తా చాటింది. అయిదు విభాగాల్లో పురస్కారాలు దక్కించుకున్న అడెలె వేదికపైనే తన అవార్డును ముక్కలు చేసి సహ సింగర్ తో పంచుకుని ప్రశంసలు అందుకుంది. ప్రధానమైన బెస్ట్‌ ఆల్బమ్‌, బెస్ట్‌ రికార్డ్‌, బెస్ట్‌ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ మూడు విభాగాల్లో అడెలెపై అమెరికన్‌ సింగర్‌ బియాన్స్‌ ఓడిపోయింది. దీంతో తాను ఎంతగానో అభిమానించే బియాన్స్‌ కు దక్కాల్సిన అవార్డు తనకు రావడాన్ని అంగీకరించలేకపోయిన అడెలె, తనకు వచ్చిన గ్రామీ అవార్డును రెండు ముక్కలు చేసి, వేదికపైకి బియాన్స్ ను ఆహ్వానించి, ఆమెతో పంచుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

కాగా, తొమ్మిది విభాగాల్లో నామినేట్‌ అయిన అడెలె బెస్ట్‌ ఆల్బమ్‌, బెస్ట్‌ రికార్డ్‌, బెస్ట్‌ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌, బెస్ట్‌ పాప్‌ సోలో పర్‌ ఫార్మెన్స్‌ (హలో), బెస్ట్‌ పాప్‌ వోకల్‌ ఆల్బమ్‌ విభాగాల్లో గ్రామీ పురస్కారం దక్కించుకుని సత్తాచాటింది. దీంతో ఆమెపై అభినందనల వర్షం కురుస్తోంది. బియాన్స్ ను వేదికపైకి ఆహ్వానించిన సందర్భంలో ఆహూతులంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేయడం విశేషం. 

  • Loading...

More Telugu News