: హిందువులు మ‌త‌మార్పిడిని ప్రోత్సహించరు.. అందుకే వారి జనాభా తగ్గుతోంది: కిర‌ణ్ రిజిజు


భారత్‌లో హిందువుల సంఖ్య త‌గ్గిపోతోంద‌ని, హిందువులు మ‌త‌మార్పిడిని ప్రోత్స‌హించ‌క‌పోవ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ని కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిర‌ణ్ రిజిజు అన్నారు. కాగా, మిగ‌తా దేశాల‌తో పోలిస్తే భార‌త్‌లో మైనార్టీల సంఖ్య మాత్రం పెరిగిపోతూ వ‌స్తోంద‌ని ఆయ‌న చెప్పారు. భార‌త్ ఒక‌ లౌకిక‌వాద దేశ‌మ‌ని చెప్పిన ఆయ‌న‌.. దేశంలో అన్ని మతాల‌వాళ్లు స్వేచ్ఛగా, ప్ర‌శాంతంగా జీవిస్తున్నార‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు కాంగ్రెస్ మాత్రం.. న‌రేంద్ర‌ మోదీ అరుణాచల్ ప్ర‌దేశ్‌ను హిందువుల రాష్ట్రంగా మార్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపణలు గుప్పిస్తోంద‌ని, అది స‌రికాద‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇలాంటి రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయ‌కూడ‌ద‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. ప్ర‌శాంతంగా జీవిస్తున్న అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను కాంగ్రెస్ రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.





  • Loading...

More Telugu News