: మా అంతట మేముగా ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనలేం: అశోక్ బాబు


ఏపీకి ప్రత్యేక హోదాపై అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాటం చేస్తే మద్దతు ఇస్తామే తప్పా, ప్రత్యేక హోదా ఉద్యమంలో ఉద్యోగులుగా తమంత తాము పాల్గొనలేమని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేశారు. విజయవాడలో ఏపీ ఎన్జీవో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ రోజు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదాపై రాజకీయ పార్టీలు మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలు విడివిడిగా పోరాడటం వల్ల లాభం లేదని, కలిసికట్టుగా పోరాడాలని సూచించారు.

  • Loading...

More Telugu News