: మా కొలువులు మాకు కావాలి.. అనుమతి లేకపోయినా ర్యాలీ నిర్వహించి తీరుతాం: కోదండరాం
‘మా కొలువులు మాకు కావాలి’ పేరిట ఈ నెల 22న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ జేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి అధికారుల నుంచి అనుమతి రాకపోయినా ర్యాలీ నిర్వహించి తీరుతామని ఆయన పేర్కొన్నారు. సుందరయ్య కళా నిలయం నుంచి ఇందిరా పార్క్ వరకు నిరుద్యోగులతో ‘చలో హైదరాబాద్’ నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగా, ఈ నెల 3వ తేదీన ఇందుకు సంబంధించిన పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు. తెలంగాణలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా పట్టించుకోలేదని కోదండరాం ఇటీవల విమర్శించారు.