: చాక‍్లెట్ల తయారీపై పీహెచ్‌డీ కోర్సు... ఏడాదికి 12.5 లక్షల రూపాయల స్కాలర్‌షిప్
చాక్లెట్‌ల రుచిని ఇష్టపడేవారికి, వాటి తయారిపై ఆసక్తి ఉన్నవారికి యూకే, బ్రిస‍్టల్‌లోని యూనివర్సిటీస్ ఆఫ్ ఫాకల్టీ ఆఫ్ హెల్త్ అండ్ అప్లైడ్ సైన్సెస్ చక్కని అవకాశం కల్పిస్తోంది. చాక‍్లెట్ల తయారీపై పీహెచ్‌డీ కోర్సును అందిస్తున్నట్లు, ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఈ కోర్సులో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఏడాదికి రూ.12.5 లక్షల స్కాలర్‌షిప్ కూడా అందించనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా చాక్లెట్ల తయారీ కంపెనీ మండెలెజ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు మాట్లాడుతూ... విదేశాల్లో కష్టపడి చదవడమే కాదని, ఇష్టపడి ఎంతో నేర్చుకునే కోర్సులు ఉన్నాయని అన్నారు. పీహెచ్‌డీ విజయవంతంగా పూర్తి చేసిన వారికి జాబ్ కూడా ఇస్తామని చెప్పారు. అంతేగాక, విద్యార్థులు కోర్సు సమయంలో ట్రెయినీ ఉద్యోగులుగా కూడా పనిచేయవచ్చని తెలిపారు.