: అరెస్టై బెయిల్ పై వచ్చిన బంగ్లాదేశ్ క్రికెటర్ పై మరో కేసు


తన గర్ల్ ఫ్రెండ్ నస్రీన్ సుల్తానాకు సంబంధించిన అభ్యంతరకర ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వివాదంలో అరెస్టై, బెయిల్ పై బయటకు వచ్చిన బంగ్లాదేశ్ క్రికెటర్ అరాఫత్ సన్నీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. అరాఫత్ తన భర్త అని... అదనపు కట్నం కోసం అతను, అతని తల్లి తనను తరచూ వేధిస్తున్నారని అతడి గర్ల్ ఫ్రెండ్ నస్రీన్ సుల్తానా ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అరాఫత్ పై మహిళలు, పిల్లల అణచివేత చట్టం కింద ఢాకా పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక కోర్టులో అతడిని, అతడి తల్లిని హాజరుపరిచారు. విచారణ నిమిత్తం ఏడు రోజుల కస్టడీకి అరాఫత్ ను అప్పగించాలని కోర్టును పోలీసులు కోరారు. కోర్టు విచారణ సందర్భంగా తాను అరాఫత్ భార్యనని అతని గర్ల్ ఫ్రెండ్ నస్రీన్ తెలిపింది. మరోవైపు నస్రీన్ అసభ్యకర ఫొటోల కేసులో దోషిగా తేలితే... అరాఫత్ కు 14 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 

  • Loading...

More Telugu News