: రిసార్టుల్లో ఉన్న ఎమ్మెల్యేల వాంగ్మూలాన్ని హైకోర్టుకి సమర్పించిన తమిళనాడు అధికారులు
అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ శశికళ సుమారు 92 మంది ఎమ్మెల్యేలను పలు రిసార్టుల్లో ఉంచిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ప్రతిపక్షాలు మండిపడుతూ ఎమ్మెల్యేలను అక్రమంగా నిర్బంధించారని ఆరోపణలు చేయడంతో మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు సదరు ఎమ్మెల్యేల వాంగ్మూలాలను తీసుకున్న పోలీసులు ఆ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. అధికారులు కోర్టుకి ఏయే అంశాలు తెలిపారో తెలియాల్సి ఉంది. మరోవైపు పోయెస్‌గార్డెన్ వద్దకు భారీ సంఖ్యలో అన్నాడీఎంకే కార్యకర్తలు చేరుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతివ్వాలని వారు నినాదాలు చేస్తున్నారు.