: ఏ చర్చ జరపకుండానే తిరిగి వెళ్లిపోయిన స్టాలిన్.. సచివాలయం చేరుకున్న పన్నీర్ సెల్వం
తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శశికళ వేస్తోన్న ఎత్తులకు పై ఎత్తులు వేస్తోన్న పన్నీర్ సెల్వం సచివాలయం చేరుకున్నారు. అక్కడ పలువురు అధికారులతో ఆయన భేటీ అయ్యారు. ఆయన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే, అదే సచివాలయానికి ప్రతిపక్ష డీఎంకే నేత స్టాలిన్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన సచివాలయంలో ఇరవై నిమిషాల వరకు ఉండి వెళ్లిపోయారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పన్నీర్ సెల్వం.. ప్రతిపక్ష నాయకుడు ఎంకే స్టాలిన్‌తో భేటీ అవుతున్నారని అందరూ ఊహించారు. అయితే, పన్నీర్‌తో ఎటువంటి చర్చ జరపకుండానే స్టాలిన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్టాలిన్ అటు వెళ్లగానే పన్నీర్ సచివాలయానికి చేరుకున్నారు.