: టీడీపీకి అనుకూలంగా ఉన్నవారినే సదస్సుకు ఆహ్వానించారు!: రోజాను అడ్డుకోవడం పట్ల కాంగ్రెస్ నేతల స్పందన!
అమరావతిలో జరిగిన మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు వెళుతున్న వైసీపీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు అడ్డుకోవడాన్ని ఏపీ కాంగ్రెస్ నేతలు మల్లాది విష్ణు, కె శివాజీలు తప్పుబట్టారు. ఈ ఉదయం విజయవాడలో వారు మాట్లాడుతూ, ప్రభుత్వ వైఖరి ముమ్మాటికీ మహిళలను అవమానించడమే అని విమర్శించారు. ఎయిర్ పోర్టులోనే అడ్డుకుని, కారులో ఆమెను హైదరాబాద్ తరలించడం ప్రజాస్వామాన్ని అపహాస్యం చేయడమే అని అన్నారు. కేవలం టీడీపీకి అనుకూలంగా ఉన్నవారినే సదస్సుకు ఆహ్వానించారని... మహిళల సమస్యల పట్ల పోరాటం చేస్తున్న సోనియాగాంధీ, మేధా పాట్కర్, బృందా కారత్ లాంటి వారిని ఎందుకు ఆహ్వానించలేదని నిలదీశారు.