: పదే పదే రిసార్టుకు ఎందుకు?: పన్నీర్ సెల్వం సూటి ప్రశ్న


తాను బలవంతంగా పట్టుకుని ఉంచిన ఎమ్మెల్యేలు ఎక్కడ చేజారి పోతారోనని శశికళ తీవ్ర భయాందోళనతో ఉందని పన్నీర్ సెల్వం ఆరోపించారు. అందుకే వారిని ఉంచిన గోల్డెన్ బే రిసార్టుకు పదే పదే తిరుగుతున్నారని విమర్శించారు. ఈ ఉదయం సచివాలయానికి బయలుదేరే ముందు ఆయన తన వర్గం అనుచరులతో సమావేశమై, పరిస్థితిని సమీక్షించారు. ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారని చెప్పుకుంటున్న ఆమె, రిసార్టు చుట్టూ ఎందుకు తిరగాలని, వారిని బయటకు ఎందుకు వదలడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను బలవంతంగా బంధించి ఇబ్బందులు పెడుతున్నది చాలక, వారిని వేధిస్తున్నారని ఆరోపించారు. రిసార్టుపై పోలీసులతో దాడి చేయించే విషయమై పన్నీర్ నేడు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News