: సచివాలయానికి చేరుకున్న స్టాలిన్.. మరికాసేపట్లో అక్కడికే రానున్న పన్నీర్
తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో ఏ నిమిషంలో ఏం జరుగుతోందనన్న ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు శశికళ ముఖ్యమంత్రి పదవి కోసం పావులు కదుపుతుంటే, ఆమెకు దీటుగా పన్నీర్ సెల్వం కూడా దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలో పన్నీర్ తన నివాసం నుంచి పలువురు నేతలతో కలిసి ఆ రాష్ట్ర సచివాలయానికి బయలుదేరారు. అయితే, అదే సచివాలయానికి ప్రతిపక్ష డీఎంకే నేత స్టాలిన్ కూడా ఇప్పటికే వచ్చారు. శశికళతో విభేదాలు వచ్చిన అనంతరం సుమారు ఆరు రోజుల నుంచి పన్నీర్ సెల్వం ఇంతవరకు సచివాలయం వద్దకు రాలేదు.