: సాధారణ మహిళనే... నా శక్తిని తక్కువగా అంచనా వేయొద్దు: శశికళ హెచ్చరిక


"అమ్మతో కలసి నేను చెన్నై, బెంగళూరుల్లోని కారాగారాలను చూశాను. ఆపై తిరిగి వచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాం. కాబట్టి మహిళా శక్తిని తక్కువగా అంచనా వేయవద్దు. నేను సాధారణ మహిళనే. కానీ ఏదైనా చేయగలను. జయలలితలోని సివంగి పంజా నీడలో పెరిగిన నేనూ సింహాన్నే" అని శశికళ తీవ్ర హెచ్చరిక చేశారు. అంతకుముందు రాజకీయాల్లో ఓ మహిళ రాణించడం చాలా కష్టమని వ్యాఖ్యానించిన ఆమె, ఆపై గంటల వ్యవధిలోనే మాటమార్చి తన సత్తా చూపిస్తానని అన్నారు. పన్నీర్ సెల్వం వెంట పట్టుమని పది మంది కూడా అండగా లేరని, అన్నాడీఎంకే పార్టీ ఆసాంతం తన వెనుకే ఉందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News