: నాడు చంద్రబాబు గెలిచాడు... నేడు శశికళ ఎదురుచూస్తోంది... కారణం చెప్పిన దగ్గుబాటి


ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన్ను పదవీచ్యుతుడిని చేసి అధికారాన్ని చంద్రబాబు సొంతం చేసుకున్న పరిస్థితులను, ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న రాజకీయాలను దగ్గుబాటి వెంకటేశ్వరావు పోల్చారు. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, ఆనాడు చంద్రబాబు వెనుక ఓ మీడియా అండగా ఉందని, ఇప్పుడు శశికళ చేతుల్లో మీడియా లేదని అదే పెద్ద వ్యత్యాసమని, శశికళకు విజయాన్ని దూరం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

అప్పట్లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కారణాలేవైనా చంద్రబాబుకు మద్దతుగా నిలిచారని, ఇప్పుడు శశికళ వెనుక జయలలిత కుటుంబం లేకపోవడం మైనస్ అని అన్నారు. గతంలో మూడు సార్లు పన్నీర్ సెల్వంకు సీఎం పీఠం బాధ్యతలను జయలలిత అప్పగించారని, శశికళను ఇంటికే పరిమితం చేశారని గుర్తు చేస్తూ, సీఎంగా ఆమె తగిన వ్యక్తని జయలలిత భావించే వుంటే ఆమెనే ఎన్నుకుని ఉండేవారని అన్నారు. వెన్నుదన్నుగా మీడియా లేకపోవడం శశికళకు పెద్ద దెబ్బని తెలిపారు.

  • Loading...

More Telugu News