: జైలు నాకు కొత్తకాదు.. ఎరుపెక్కిన కళ్లతో విలపిస్తూ చెప్పిన శశికళ


జైలు జీవితం తనకు కొత్తకాదని, బెంగళూరు జైలు కూడా తనకు పాతదేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి మహాబలిపురం సమీపంలోని కువత్తూరు గోల్డెన్ బే రిసార్ట్స్‌లో తన ఎమ్మెల్యేలతో సమావేశమైన ఆమె కన్నీళ్లు ఆపుకుంటూ గంటసేపు మాట్లాడారు. జయలలితతో కలిసి తాను ఎన్నో కష్టాలు అనుభవించానని, తనకు వ్యతిరేకంగా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ధైర్యంగా ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేశారు.

ఇక్కడున్న మీరంతా సింహాలేనని పేర్కొన్న శశికళ, తనను తాను కూడా ఓ సివంగిలా అభివర్ణించుకున్నారు. మనం భయపెట్టాలి తప్ప భయపడకూడదన్నారు. ‘అమ్మ’ మనకు అప్పగించిన అధికారాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసి ముచ్చటగా మూడోసారి అధికార పగ్గాలు చేపడదామని పిలుపునిచ్చారు. పన్నీర్ సెల్వం తన కుట్రలతో పార్టీకి కళంకం తెచ్చారని మండిపడ్డారు. తన ముందున్న 125 మంది ఎమ్మెల్యేలే తనకు కోటిమందితో సమానమని శశికళ పేర్కొన్నారు. ప్రతిపక్ష డీఎంకేపైనా నిప్పులు చెరిగిన శశికళ, అక్కడ ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో తనకు తెలుసని పేర్కొన్నారు. ఆ పార్టీలో ఉన్న తన వాళ్లు కానీ, మరెవరైనా కానీ కుట్రలు చేస్తే ధైర్యంగా ఎదుర్కొందామని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News