: అమ్మపై అలిగి అర్ధరాత్రి బయటకొచ్చిన యువతి.. పోలీసులతో సెల్ఫీలు దిగి హల్‌చల్


తల్లి మీద అలిగిన ఓ యువతి అర్ధరాత్రి రోడ్డు మీదకు వచ్చి హల్‌చల్ చేసింది. పోలీసులతో సెల్ఫీలు దిగుతూ హంగామా చేసింది. హైదరాబాదులోని యూసుఫ్‌గూడ నుంచి బోరబండ వెళ్లే మార్గంలో రహమత్‌నగర్ చౌరస్తా వద్ద అర్ధరాత్రి దాటాక 1:30 గంటలకు రోడ్డుపై ఒంటరిగా కనిపించిన యువతిని చూసి పోలీసులు అవాక్కయ్యారు. దగ్గరికెళ్లి ప్రశ్నించారు. అమ్మతో సహా ఇంట్లో వాళ్లు తనను ఇబ్బంది పెడుతున్నారని, అందుకనే రోడ్డు మీదకు వచ్చానని యువతి చెప్పడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. ఆమె మాటలపై నమ్మకం లేని వారు ఆమె తల్లి ఫోన్ నంబరు తీసుకుని మాట్లాడారు. తన కుమార్తె సినిమాకు వెళ్లిందని చెప్పడంతో యువతిపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను స్వయంగా ఇంటికి తీసుకెళ్లి దిగబెట్టారు.

  • Loading...

More Telugu News