: ‘అమ్మ’ ఆత్మ ఎవరిని దీవిస్తుందో?.. సందేహం వ్యక్తం చేసిన వర్మ
నరాలు తెగే ఉత్కంఠకు కారణమవున్న తమిళ రాజకీయాలను నిశితంగా గమనిస్తున్న సంచలన దర్శకుడు వర్మ తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం అటు ‘అమ్మ’ నెచ్చెలి, ఇటు ఆమె వీర విధేయుడి మధ్య జరుగుతున్న యుద్ధంలో గెలుపెవరిదో తెలియక ఇటు ప్రజలు, అటు రాజకీయ విశ్లేషకులు కూడా అయోమయానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా వర్మ మరోమారు తన మనసులోని మాటను బయట పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘‘జయలలిత ఆత్మ ఏమని ఆలోచిస్తుందో?’’ అంటూ సందేహం వెలిబుచ్చారు. ‘అమ్మ’ ఆత్మ చివరికి పన్నీర్ సెల్వంను దీవిస్తుందా? లేక నెచ్చెలి శశికళను దీవిస్తుందో? అంటూ అనుమానం వ్యక్తం చేశారు.