: గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ‘చిన్నమ్మ’
తమిళనాడు ఇన్‌చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుకు శశికళ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 76వ జన్మదినం జరుపుకుంటున్న ఆయనకు ఆదివారం శశికళ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఫిబ్రవరి 12, 1942లో కరీంనగర్‌లో జన్మించిన ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. బీజేపీలో కీలక నేతగా మారిన విద్యాసాగర్‌రావు ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం తమిళనాడుకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. తమిళనాట రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ఆయన తీసుకోబోయే నిర్ణయం గురించి సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.