: నేను ఆత్మహత్య చేసుకుంటాననే వార్తలు అవాస్తవం!: శశికళ


తనకు సీఎం పదవి దక్కని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ అన్నారు. ఈ విషయమై గవర్నర్ విద్యాసాగర్ రావుకు లేఖ రాశానంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని, ఆ వార్తల్లో వాస్తవం లేదని ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆమె అన్నారు. ఎంపీలు అందరూ పన్నీర్ సెల్వం దగ్గరికి వెళ్తున్నారంటే, ఆ కుట్ర వెనుక ఎవరు ఉన్నారో అర్థమవుతోందంటూ కేంద్ర ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

  • Loading...

More Telugu News