: నాకు బీపీ, నోటి దురుసు లేవు!: పోసాని కృష్ణ మురళి


తనకు బీపీ, నోటి దురుసులు లేవని ప్రముఖ మాటల రచయిత, నటుడు పోసాని కృష్ణమురళీ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు పైవిధంగా ఆయన సమాధానమిచ్చారు. తన నోటి దురుసుతో ఏ ఒక్కరిని శత్రువుగా చేసుకోలేదని అన్నారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ ను మీరు విమర్శించిన తీరుపై చాలా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి అనే ప్రశ్నకు పోసాని స్పందిస్తూ, ‘నా కంటే పెద్ద పదాలు ఆయన వాడారు. నేను మనిషిని ఫస్టు. కమ్మ, కాపు, మాల.. అన్నది తర్వాత. నాకు ఆత్మాభిమానం ఉంటుంది కదా.. వీహెచ్ మాట్లాడిన తీరకి నేను తట్టుకోలేకపోయాను. నేను అనేశా. అయితే, ‘ వీహెచ్ ఏదో పెద్దవాడు తొందరపడ్డారు. మరి.. మీరు ఎందుకు అలా మాట్లాడారు?’ అని ఆ తర్వాత చాలా మంది నన్ను అడిగారు. ‘నేను ఏదో చిన్నవాడిని తొందరపడ్డాను’ అని సమాధాన మిచ్చాను’ అని పోసాని చెప్పారు.

  • Loading...

More Telugu News