: పన్నీర్ సెల్వం చాలా మంచి వ్యక్తి: తమిళ నటుడు, దర్శకుడు మనోబాల


పన్నీర్ సెల్వంకు మద్దతు ఇస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ జాబితాలో తమిళ నటుడు, దర్శకుడు, నిర్మాత మనోబాల కూడా చేరారు. పన్నీర్ కు తన మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పన్నీర్ సెల్వం చాలా మంచి వ్యక్తి అని, ఆయనతో కలిసి పని చేశానని అన్నారు. పన్నీర్ నాయకత్వంలోనే రాష్ట్రం ముందుకు వెళుతుందని, అభివృద్ధి సాధించండం సాధ్యమవుతుందని అన్నారు. కాగా, పన్నీర్ సెల్వంకు మొదటి నుంచి తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి మద్దతు లభిస్తోంది. ప్రముఖ నటుడు కమలహాసన్, అరవింద స్వామి, శరత్ కుమార్, ఆర్య, గౌతమి, తదితరులు పన్నీర్ కు ఇప్పటికే తమ మద్దతు ప్రకటించారు.

  • Loading...

More Telugu News