: పోరాటం చేస్తే గానీ విజయం దక్కదు: లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్


సమాజంలో ఎన్నో అంశాలపై పోరాటం చేస్తే గానీ విజయం దక్కదని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. అమరావతిలో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ, మహిళల సాధికారతకు ఈ తరహా సదస్సులు మరిన్ని నిర్వహించాలని, జాతి నిర్మాణానికి ఇటువంటి సదస్సులు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. నాటి నుంచి నేటి వరకు మహిళలు పని చేసిన చోట్ల సమర్థవంతంగా రాణించారని, అన్ని రంగాల్లో ముందున్నారని , విధానాల రూపకల్పనలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు, సాధికారత సాధించిన మహిళ జాతి నిర్మాణంలో కీలకం కాగలదని, మహిళల సాధికారితకు తమ వంతు సహకారం అందించాలని కోరుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అంశాన్ని కూడా సుమిత్రా మహాజన్ ప్రస్తావించారు. 

  • Loading...

More Telugu News