: టీఆర్ఎస్ ఎంపీ కవితకు థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసిన తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎంపీ కవితకు జనసేన అధినేత, పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ, "ఏపీ ప్రత్యేక హోదాకు మనస్ఫూర్తిగా మద్దతు పలికిన నిజామాబాద్ ఎంపీ కవిత గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఆంధ్ర, తెలంగాణ కలిసి పనిచేయాలి. ఐకమత్యంగా ఉంటే నిలుస్తాం. విడిపోతే నష్టపోతాం. జైహింద్" అని ట్వీట్ చేశారు. గంట క్రితం పవన్ ఈ ట్వీట్ చేయగా, వేల సంఖ్యలో లైక్ లను, రీ ట్వీట్ లను, షేర్లను తెచ్చుకుని సోషల్ మీడియాలో వైరల్ అయింది.
#JanaSena #Telangana pic.twitter.com/UqntPgM7dm
— Pawan Kalyan (@PawanKalyan) February 12, 2017