: మారిన మా టీవీ లోగో... ఇక స్టార్ నెట్ వర్క్ మార్క్
రెండు దశాబ్దాలకుపైగా తెలుగు టీవీ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన మా టీవీ, ఇకపై 'స్టార్ మా'గా మారిపోనుంది. మా టీవీలో అత్యధిక వాటాలను గత సంవత్సరం స్టార్ గ్రూప్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, మా టీవీ లోగో కొనసాగుతూ వచ్చింది. ఇక రేపటి నుంచి మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రసారం కానున్న నేపథ్యంలో, రేపటి నుంచే లోగోను మార్చాలని నిర్ణయించుకున్న స్టార్ టీవీ యాజమాన్యం ఈ విషయాన్ని నేడు ప్రకటించింది. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో లోగో మార్పును అధికారికంగా ప్రకటించారు. కొత్త లోగోలో 'మా' అనే అక్షరాలపై స్టార్ టీవీ సింబల్ ను చేర్చారు.