: గవర్నర్ తీరుపై మండిపడ్డ సుబ్రహ్మణ్య స్వామి!
తమిళనాడులో రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ ఎంపీ, సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మండిపడ్డారు. ఎమ్మెల్యేల మద్దతు ఉన్న వ్యక్తిని ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానించక పోవడం ప్రలోభాల కిందకే వస్తుందని, తమిళనాడు సీఎంగా ఎవరికి అవకాశమివ్వాలనే అంశంలో గవర్నర్ నాన్చుడు ధోరణి సబబు కాదన్నారు. రేపటి కల్లా గవర్నర్ ఓ నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో ఆర్టికల్ 32 కింద రిట్ దాఖలు చేస్తానని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన తెలిపారు. న్యాయపోరాటం ద్వారా తమిళ రాజకీయ అనిశ్చితిని అంతమొందిస్తామని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు.