: కన్నడ నాట కలకలం... కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిపై ఐటీ దాడి... రూ. 120 కోట్లు స్వాధీనం
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై ఐటీ శాఖ దాడులు చేసి భారీగా బంగారం, నగదును స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. హౌస్ కోటె ఎమ్మెల్యే నాగరాజను ఇంట్లో అధికారులు సోదాలు జరుపగా, మొత్తం రూ. 120 కోట్ల విలువైన ఆస్తులు, బంగారం, డబ్బు లభించినట్టు తెలుస్తోంది. 10 కిలోలకు పైగా బంగారం, పలు ప్రాంతాల్లోని ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, కోట్ల కొద్దీ డబ్బు ఆయన ఇంట్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటన్నింటినీ సీజ్ చేశామని, లెక్కలు చెప్పాలని ఎమ్మెల్యేను కోరామని ఐటీ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.