: అమల నన్ను ఎంతగా ప్రేమిస్తోందో ఇప్పుడు తెలిసింది: నాగార్జున


అమల తనను ఎంతగా ప్రేమిస్తోందో 'ఓం నమో వేంకటేశాయ' చిత్రాన్ని థియేటరులో చూసిన తరువాత అర్థమైందని హీరో నాగార్జున వ్యాఖ్యానించారు. సినిమా చూసిన తరువాత గంట సేపటి వరకూ తనను వదల్లేదని, సీట్లో నుంచి కదలకుండా, తన చేతిని పట్టుకునే కూర్చుందని, పెళ్లయిన కొత్తలో తనతో ఎలా ఉండేదో, అదే అనుభూతి మరోసారి తనకు గుర్తుకొచ్చిందని అన్నాడు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 21 సంవత్సరాల క్రితం వచ్చిన 'అన్నమయ్య'ను ఆదరించినట్టే ప్రజలు ఈ చిత్రాన్ని కూడా అభిమానిస్తున్నారని నాగార్జున తెలిపారు. రాఘవేంద్రరావు, భారవిలు మూడు నాలుగేళ్ల పాటు కష్టపడి ఈ కథను తయారు చేశారని చెప్పారు. తన సంగీతంతో సినిమాకు కీరవాణి ప్రాణం పోశారని కితాబిచ్చారు.

  • Loading...

More Telugu News