: రేపు పరిస్థితులన్నీ మాకే అనుకూలిస్తాయి: శశికళ
గోల్డెన్ బే రిసార్ట్ నుంచి పొయెస్ గార్డెన్ కు చేరుకున్న శశికళ మాట్లాడుతూ, తమ ఎమ్మెల్యేలంతా బాగున్నారని, పార్టీలో కలహాలు సృష్టించేందుకు కుట్ర జరుగుతోందని, న్యాయ సలహాలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు సూచించినట్లు చెప్పారు. తమిళనాడులో రేపు పరిస్థితులన్నీ తమకే అనుకూలిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ‘ఓపిక పట్టండి.. రేపు మీరే చూస్తారు కదా’ అని శశికళ అన్నారు.