: రోజా చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు!: టీడీపీ నేత ముళ్లపూడి రేణుక


అమరావతిలో జరుగుతున్న మహిళ పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనేందుకు వెళుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను టీడీపీ నేతలు తిప్పికొడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ నేత ముళ్లపూడి రేణుక స్పందిస్తూ, రోజా చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. రోజా ప్రవర్తన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని, ఎక్కడ ఈవెంట్ జరిగినా వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకోవాలని చూస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని చెప్పి వారు ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News