: ముగిసిన భేటీ.. భారీ ఆందోళనకు శశికళ వర్గం సిద్ధం?.. పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు
తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు ఉండడంతో చెన్నైలోని రాజ్‌భవన్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. అంతేగాక, ఎమ్మెల్యేలు ఉంటోన్న గోల్డెన్ బే రిసార్టుతో పాటు చెన్నైలోని సున్నితమైన అన్ని ప్రాంతాల్లోనూ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. శశికళ వర్గం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గోల్డెన్ బే రిసార్టు వద్ద శశికళ ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. అనంతరం ఆమె బయటకు రాగానే అక్కడ ఉన్న కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆమెకు మద్దతుగా నినాదాలు చేశారు.