: మ‌హిళ‌కు నరకం చూపించిన కోతులు... త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య‌


కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో కోతుల బెడ‌ద భ‌రించ‌లేక ఓ మ‌హిళ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్పడింది. దీంతో ఆమె కుమారుడు, కూతురు దిక్కులేని వార‌యిపోయారు. వివ‌రాల్లోకి వెళితే.. పుష్పలత(56) అనే మహిళ గ‌త ఏడాది భర్తను కోల్పోయింది. కూలి పని చేసుకుంటూ కొడుకును, కుమార్తెను పోషించుకుంటూ వ‌స్తోంది. ఓ రేకుల షెడ్డుతో ఉండే వారి ఇంట్లోకి ప‌దే ప‌దే వ‌స్తోన్న కోతులు ఆమె పిల్లల కోసం వండి పెట్టిన ఆహారాన్ని తిని నాశ‌నం చేసేవి. వారి ఇంటిపై కప్పు సరిగా లేకపోవడంతో లోప‌లికి ప్ర‌వేశించి వారికి న‌ర‌కం చూపించేవి. ఈ బాధ పడలేక దీంతో పుష్ప‌ల‌త ఆత్మ‌హ‌త్య చేసుకుంది. అక్క‌డ అధిక‌మైన కోతుల గోల తట్టుకోలేక ఆ ఇంటి ఇరుగుపొరుగు వాళ్లు ఇప్ప‌టికే  ఆ ప్రాంతాన్ని వ‌దిలివెళ్లారు.

  • Loading...

More Telugu News