: విశిష్ట గుర్తింపు సాధించిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ పరీక్ష
ఆన్‌లైన్‌లో నిర్వహించిన అతిపెద్ద ఉద్యోగ పరీక్షగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఇటీవల నిర్వహించిన పరీక్ష నిలిచిందని ఓ సీనియర్ రైల్వే అధికారి మీడియాకు తెలిపారు. గత నెల 17, 18, 19 తేదీల్లో ఆర్‌ఆర్‌బీ నాన్‌టెక్నికల్ పాపులర్ కేటగిరిలో నిర్వహించిన స్టేజి-2 కంప్యూటర్ బేస్డ్ పరీక్షకు 2.73 లక్షల మంది హాజరయ్యారు. ఉద్యోగ ప్రవేశాల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకే తాము ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షను నిర్వహించామని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ పరీక్ష ద్వారా మొత్తం 18,252 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.