: శశికళకు షాక్.. పన్నీర్ గూటికి చేరిన ఇద్దరు ఎంపీలు


తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని కలలుగంటున్న చిన్నమ్మ శశికళకు షాకుల మీదకు షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే, పార్టీ సీనియర్ నేతలు శశికళకు గుడ్ బై చెప్పి, పన్నీర్ సెల్వం చెంతకు చేరారు. వీరితో పాటే కొందరు ఎమ్మెల్యేలు కూడా పన్నీర్ గూటికి చేరారు. తమ బలం క్రమంగా తగ్గుతుండటంతో, క్యాంపుల్లో ఎమ్మెల్యేలను ఉంచి, వారు చేజారకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది శశికళ వర్గం. ఈ నేపథ్యంలో, శశికళకు మరో షాక్ తగిలింది. ఇంత వరకు శశి వర్గంలో ఉన్న ఇద్దరు ఎంపీలు అశోక్ కుమార్, సుందరమ్ లు పన్నీరు సెల్వం గూటికి చేరారు. పన్నీర్ నాయకత్వానికి మద్దతు తెలుపుతున్నామని వీరిద్దరూ ప్రకటించారు. వీరి రాకతో పన్నీర్ శిబిరంలో ఉత్సాహం మరింత పెరగగా... శశి శిబిరం మరింత ఆందోళనకు గురవుతోంది. 

  • Loading...

More Telugu News