: నాకు దెబ్బ తినడం మాత్రమే కాదు.. దెబ్బ తీయడం కూడా వచ్చు: పవన్ కల్యాణ్
జనసేన పార్టీ అంతిమ లక్ష్యం అధికారం కాదని... ప్రజా శ్రేయస్సు అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. సినిమాల ద్వారా తాను సంపాదించిన డబ్బును, ఇమేజ్ ను ప్రజాసేవ కోసమే ఖర్చు చేస్తానని ఆయన తెలిపారు. అమెరికాలోని న్యూహాంప్ షైర్ లో మీట్ అండ్ గ్రీట్ కు హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు దెబ్బ తినడం మాత్రమే కాదు, దెబ్బ కొట్టడం కూడా తెలుసని చెప్పారు. యువ రాజకీయ నేతలు అంటే రాజకీయ వారసులు కాదని... సామాన్య ప్రజల్లో నుంచి కొత్త తరం రావాలని తెలిపారు. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించకూడదని పిలుపునిచ్చారు.