: బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రజనీకాంత్?


తమిళ రాజకీయాలు క్షణక్షణానికి మారుతున్న వేళ... ఓ సంచలన వార్త తెరపైకి వచ్చింది. తమిళనాడులో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ... ప్రస్తుత అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, సూపర్ స్టార్ రజనీకాంత్ ను తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమైందన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. రజనీతో ఆరెస్సెస్ నేత గురుమూర్తి ఈ విషయంపై ఇప్పటికే మాట్లాడారని చెబుతున్నారు. అయితే, రజనీ నుంచి దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏదేమైనప్పటికీ, ఈ వార్త తమిళనాడులో సంచలనంగా మారింది. రాజకీయపరంగా మరింత వేడిని పెంచుతోంది. ఇదిలా ఉంచితే, ఈ ప్రచారంలో వాస్తవం లేదని గురుమూర్తి నిన్ననే ప్రకటించిన సంగతి విదితమే! 

  • Loading...

More Telugu News