: రాజకీయాలపై నాకు అవగాహన లేదు.. కానీ, సమాజాన్ని చదివే అలవాటుంది: అమెరికాలో పవన్ కల్యాణ్
సినిమాల్లో తానెప్పుడూ సౌకర్యవంతంగా ఫీల్ కాలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాటమే తనకు అంతులేని తృప్తిని ఇచ్చిందని తెలిపారు. అమెరికాలోని న్యూహాంప్ షైర్ లో జరిగిన ఓ సదస్సుకు హాజరైన పవన్... అక్కడ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, రాజకీయాల పట్ల తనకు పూర్తిగా అవగాహన లేదని... కానీ, సమాజాన్ని చదవడం, ప్రజా సమస్యల పట్ల స్పందించే అలవాటు మాత్రం తనకు ఉందని ఆయన చెప్పారు. అన్యాయాన్ని చూస్తూ తాను కూర్చోలేనని తెలిపారు. కుల రాజకీయాలు తనకు నచ్చవని, అలాంటి రాజకీయాలు చేసేవారు కూడా తనకు నచ్చరని స్పష్టం చేశారు.