: శాసనసభను సమావేశపరచాలని గవర్నర్ ను కోరాం: స్టాలిన్
శాసనసభను సమావేశపరచాలని గవర్నర్ విద్యాసాగర్ రావును కోరామని డీఎంకే నేత స్టాలిన్ అన్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించామని, రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా పాలన స్తంభించిపోయిందని, సుస్థిర పాలనకు తగు చర్యలు తీసుకోవాలని,రాజ్యాంగానికి లోబడి మంచి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. పన్నీర్ సెల్వం వెనుక డీఎంకే ఉందన్న శశికళ వ్యాఖ్యలు సరికాదని ఈ సందర్భంగా స్టాలిన్ మరోమారు పేర్కొన్నారు. గవర్నర్ ను కలసిన సమయంలో స్టాలిన్ వెంట డీఎంకే సీనియర్ నేతలు కూడా ఉన్నారు.