: ప్రియాంక చోప్రా ఇచ్చిన విందు అదిరిపోయిందంటున్న మనీష్ మల్హోత్రా!
బాలీవుడ్ ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నాడు. మనీష్ కు బెస్ట్ ఫ్రెండ్, బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ ‘బే వాచ్’ చిత్రం నిమిత్తం ప్రస్తుతం అక్కడే ఉంది. దీంతో, న్యూయార్క్ లోని ప్రియాంక అపార్టుమెంటులో ఆమెను కలిశాడు. మనీష్ తనను కలిసిన సంతోషంతో ప్రియాంక బ్రహ్మాండమైన విందు ఒకటి ఇచ్చిందని, చాలా బాగుందని మనీష్ తన ట్విట్టర్ ఖాతాలో తెగ పొగిడేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా పోస్ట్ చేశాడు. కాగా, ఇటీవల భారత్ కు వచ్చిన ప్రియాంకకు మనీష్ తన నివాసంలో గ్రాండ్ గా విందు ఇచ్చాడు. ప్రియాంకకు వెల్ కమ్ చెప్పేందుకు బాలీవుడ్ సెలెబ్రిటీలను కూడా ఆ విందుకు మనీష్ ఆహ్వానించాడు.