: రాంగ్ రూట్ లో వచ్చి..రెచ్చిపోయిన ద్విచక్రవాహన దారుడు!


రాంగ్ రూట్ లో వచ్చి తప్పు చేయడమే కాక, యువకులపై దాడి చేసి, ఆటోను పగలగొట్టిన సంఘటన హైదరాబాద్ పాతబస్తీలోని షాహినాత్ గంజ్ ప్రాంతంలో జరిగింది. భార్యా పిల్లలతో బైకుపై వెళ్తున్న వ్యక్తి రాంగ్ రూట్ లో రోడ్ దాటుతుండగా ఎదురుగా ఒక బైక్ రావడంతో వెంటనే బ్రేక్ వేశాడు. అయితే, అటుపక్కగా వచ్చిన ఆటోకు బైక్ పై ఉన్న మహిళ చీర చుట్టుకోవడంతో ఆమె కిందపడిపోయింది. భార్య కింద పడిపోవడంతో ఆ వ్యక్తి రెచ్చిపోయాడు. తాను రాంగ్ రూటులో వచ్చిన సంగతి మర్చిపోయి, ఎదురుగా బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులపై దాడి చేశాడు. అయితే, అక్కడి స్థానికులు కూడా రాంగ్ రూటులో వచ్చిన వ్యక్తికే వత్తాసు పలకడంతో, ఆ దాడి నుంచి ఆ యువకులు తప్పించుకోలేకపోయారు. తన భార్య కిందపడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ వ్యక్తి ఆ ఆటోను, బైక్ ను ధ్వంసం చేశాడు.  

  • Loading...

More Telugu News