: రిసార్టులో ఉంచిన ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న శశికళ
తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో తాను గోల్డెన్ బే రిసార్టులో ఉంచిన ఎమ్మెల్యేలతో శశికళ నటరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుతం శశికళ చెన్నైలోని పోయెస్ గార్డెన్లోని వేద నిలయంలో అన్నాడీఎంకే ఎంపీలతో భేటీ అయ్యారు. మరోవైపు ఆ రాష్ట్ర ఇన్ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ నుంచి ఆ రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఎటువంటి ప్రకటనా రాలేదు. తన క్యాంపు నుంచి తరలిపోకుండా శశికళ ఎమ్మెల్యేలను బంధించారని ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. అమె ఎమ్మెల్యేలను ఉంచిన రిసార్టు లోపలికి ఎవ్వరూ వెళ్లకుండా శశికళ వర్గీయులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.