: పన్నీర్ సెల్వం ఒక్కరే రాష్ట్రాన్ని కాపాడగలరు: మాజీ మంత్రి పొన్నుస్వామి
పన్నీర్ సెల్వం ఒక్కరే రాష్ట్రాన్ని కాపాడగలరని కేంద్రమాజీ మంత్రి పొన్నుస్వామి అభిప్రాయపడ్డారు. పన్నీర్ కు అందరూ అండగా నిలవాలని, గవర్నర్ విద్యాసాగర్ రావు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు. అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలను శశికళ వర్గీయులు నిర్బంధించడం అమానుషమని, డబ్బుల కోసం శశికళ శిబిరంలో చేరొద్దని ఆ ఎమ్మెల్యేలకు పొన్నుస్వామి విజ్ఞప్తి చేశారు. కాగా, జయలలిత పక్కన పెట్టిన ఎమ్మెల్యేల్లో కొందరు మాత్రమే పన్నీర్ సెల్వం వైపు వెళ్లారని, తాము ఎప్పుడైనా అసెంబ్లీలో బలప్రదర్శనకు సిద్దమని శశికళ వర్గం అంటోంది.