: తమిళనాడు సంక్షోభంపై ఎటువంటి నివేదికలు అందలేదు: కేంద్ర హోం శాఖ
తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. తమిళనాడు సీఎంగా శశికళ వస్తారా? లేక పన్నీర్ సెల్వం కొనసాగుతారా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ విద్యాసాగర్ రావు నుంచి ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం ఇంకా వెలువడలేదు. ఇందుకు సంబంధించిన నివేదికలను రాష్ట్రపతి, కేంద్ర హోం శాఖలకు గవర్నర్ పంపారనే వార్తలు మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే, తమకు ఎటువంటి నివేదికలు ఇంకా అందలేదని కేంద్ర హోం శాఖ పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.