: రూ.2,610 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని ఆర్జించిన ఎస్‌బీఐ
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలానికి 70.88శాతం వృద్ధిని సాధించి దూసుకుపోతోంది. గతేడాది ఆర్థిక సంవత్సరం ఇదే మూడో త్రైమాసికంలో రూ.1,115 కోట్లకు పరిమితం అయిన వృద్ధి, ఈ సారి ఆర్థిక విశ్లేషకుల అంచనాలకు మించి రాణించి రూ.2,610 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని సాధించింది. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లోని వాటాను 3.9శాతం విక్రయించడం ద్వారా రూ.1,755 కోట్లను పొందింది.