: అప్పట్లో సంజయ్ దత్ సూట్లు వేసుకునేవాడిని: నటుడు అనిల్ కపూర్


తనకు సొంత సూట్లు లేకపోవడంతో నటుడు సంజయ్ దత్ వి వేసుకుని  ఫంక్షన్లకు వెళుతుండే వాడినని ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. జాకీష్రాఫ్, అనిల్ కపూర్ నటించిన నాటి సూపర్ హిట్ చిత్రం ‘రామ్-లక్ష్మణ్’ విడుదలై ముప్ఫై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు సుభాష్ ఘాయ్ ముంబయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనిల్ కపూర్, జాకీష్రాఫ్, గుల్షన్ గ్రోవర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ, తాను వేసుకొచ్చిన సూట్ తనది కాదని, అప్పట్లో కూడా ఏదైనా కార్యక్రమాలకు వెళితే అద్దె సూట్ ధరించే వాడినని చెప్పాడు. తనకు సొంత సూట్లు లేకపోవడంతో డిజైనర్ అక్బర్ దగ్గరకు వెళ్లి అడిగితే, వేరే నటుల సూట్లను ఆయన అద్దెకు తెచ్చేవారని, అలా తీసుకువచ్చిన వాటిలో నటుడు సంజయ్ దత్ వి తనకు ఇచ్చేవారని అన్నాడు. అయితే, సంజయ్ దత్ బాడీకి, తనకు చాలా తేడా ఉండటంతో ఆ సూట్లు తనకు కొంచెం వదులుగా ఉండేవని చెప్పుకొచ్చారు. గుల్షన్ గ్రోవర్ మాట్లాడుతూ, అనిల్ కపూర్ కు, తనకు ధరించేందుకు సూట్లు ఉండేవి కాదని, అనిల్ కు సంజయ్ దత్ సూట్లు దొరికేవని, తనకు మాత్రం కేవలం చొక్కాలే దొరికేవని నవ్వుతూ అన్నాడు.

  • Loading...

More Telugu News