: రిసార్ట్స్ బయటకు వచ్చి.. మీడియాకు వివరణ ఇచ్చుకున్న శశికళ వర్గీయులు


త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోసం పావులు క‌దుపుతున్న అన్నాడీఎంకే జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ శ‌శిక‌ళ న‌ట‌రాజ‌న్ సుమారు 120 మంది ఎమ్మెల్యేల‌ను ప‌లు రిసార్ట్స్‌ల్లో నిర్బంధించార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్న వేళ.. ఎన్‌.మురుగుమారన్‌, ఎం గీత, జయంతి పద్మనాభన్‌, మరో ఐదుగురు ఎమ్మెల్యేలు గోల్డెన్‌ బే బీచ్‌ రిసార్ట్ కు రెండు కిలోమీటర్ల దూరంలో మీడియా ప్రతినిధులను కలిసి తమనెవరూ కిడ్నాప్‌ చేయలేదని స్పష్టం చేశారు. తమను అక్క‌డ‌ ఎవరూ నిర్బంధించ‌లేద‌ని వారు చెప్పారు. అన్నాడీఎంకే పార్టీతో పాటు శశికళపై పన్నీర్‌ సెల్వం తిరుగుబాటు చేసిన నేప‌థ్యంలోనే తాము రిసార్ట్‌ వద్దే విశ్రాంతి తీసుకుంటున్న‌ట్లు వ్యాఖ్యానించారు.

శశికళకు తమ మద్దతు, సానూభూతి తెలుపుతూ తాము స్వ‌చ్ఛందంగానే అక్క‌డే ఉంటున్నామ‌ని చెప్పారు. ప‌న్నీర్ సెల్వం స‌హా పార్టీనేత‌లంద‌రి ఇష్టంతోనే శశికళ శాసనసభాపక్ష నేతగా, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ఎన్నిక‌య్యార‌ని అన్నారు. ఇప్పుడు ప‌న్నీర్ సెల్వం కావాలనే ఎదురుతిరిగారని వారు వ్యాఖ్యానించారు. త‌మ‌కు ప‌లువురు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తున్నార‌ని, అందుకే తాము త‌మ ఫోన్‌ల‌ను స్విచ్ఛాప్ చేశామ‌ని అన్నారు.

  • Loading...

More Telugu News