: రాజ్యసభలో మాకు పూర్తి మెజారిటీ వచ్చిన తర్వాత ఆ పనిచేస్తాం: వెంకయ్యనాయుడు


సుదీర్ఘకాలంగా పార్లమెంటు ఆమోదానికి ఎదురు చూస్తున్న మహిళా కోటా బిల్లుపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లు రాజ్యసభలో తమకు మెజారిటీ వచ్చిన తర్వాత అమలుకు నోచుకుంటుందన్నారు. ప్రధాని మోదీ దృష్టిలో ఈ అంశం ఉందని, పార్లమెంటు ఏకాభిప్రాయంతో ఈ బిల్లును ఆమోదించేట్లయితే అందుకు ఎంతో సమయం పట్టదన్నారు. రాజ్యసభలో ఒక్కసారి మాకు పూర్తి మెజారిటీ వచ్చేస్తే మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించేస్తామని అమరావతిలో జరిగిన మహిళా పార్లమెంటేరియన్ల సమావేశం సందర్భంగా వెంకయ్యనాయుడు చెప్పారు. అయితే, బిల్లు తెస్తే సరిపోదని, రాజకీయ సంకల్పం, పరిపాలనా నైపుణ్యం అవసరమని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఆర్థికాభివృద్ధిపై లింగ అసమానత్వం తీవ్రమైన ప్రభావం చూపుతుందని... అసమానత్వాలకు అంతం పలికేందుకు స్త్రీ, పురుష సాధికారతపై సమానంగా దృష్టి సారించాలన్నారు.

  • Loading...

More Telugu News