: జనరల్ సెక్రటరీగా శశికళ ఎన్నిక చెల్లదు: ఈసీకి లేఖ రాసి మరో ట్విస్ట్ ఇచ్చిన మధుసూదనన్
తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో ఏర్పడిన సంక్షోభం కొనసాగుతోంది. ఆ పార్టీ నేతలు రోజుకో ట్విస్ట్ ఇస్తున్నారు. మొదట్లో శశికళకు మద్దతు ఇచ్చిన ఆ పార్టీ ప్రిసీడియం ఛైర్మన్ మధుసూదనన్ తాజాగా తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గంలోకి వచ్చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ లేఖను రాసి, అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళకు షాక్ ఇచ్చారు. శశికళ జనరల్ సెక్రటరీ ఎన్నిక చెల్లదని ఆయన తెలిపారు. పార్టీ నియామవళి ప్రకారం ఐదేళ్ల సభ్యత్వం ఉంటేనే ఆ హోదాకు అర్హులవుతారని ఆయన తెలిపారు.