: రేపిస్టులను తలకిందులుగా వేలాడదీసి చర్మం ఊడొచ్చేలా కొట్టాలన్న కేంద్ర మంత్రి ఉమాభారతి


అత్యాచారాలకు పాల్పడే వారిని (రేపిస్టులను) చాలా దారుణంగా శిక్షించాలని కేంద్ర మంత్రి ఉమాభారతి అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రేపిస్టుల పట్ల తాను ఎంత కఠినంగా వ్యవహరించినదీ ఆమె ఉత్తపప్రదేశ్ లోని ఆగ్రాలో ర్యాలీ సందర్భంగా వెల్లడించారు.
‘‘రేపిస్టులను తలకిందులుగా వేలాడదీసి వారి చర్మం ఊడొచ్చే వరకు కొట్టాలి. ఆ తర్వాత వారి గాయాలపై ఉప్పు, కారం చల్లాలి. దాంతో వారు ప్రాణం కోసం కేకలు పెట్టాల్సిందే. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో (2003 నుంచి 2004 వరకు) నేను ఈ విధానాన్నే అమలు పరిచాను. పోలీసులు ఎప్పుడైనా అభ్యంతరం చెబితే... ప్రజలు ఎవరైతే రాక్షసుల్లా వ్యవహరిస్తారో వారి విషయంలో ఎలాంటి మానవ హక్కులు ఉండవు. రావణుడి మాదిరిగా వారి తలలూ నరికేయాల్సిందే’’ అని చెప్పినట్టు మంత్రి వెల్లడించారు.

  • Loading...

More Telugu News